![]() |
![]() |
బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వారం కెప్టెన్సీ కంటెండర్ రేస్ జోరుగా సాగుతోంది. నిన్నటిదాకా వీళ్ళేం ఆడుతారులే అనుకున్న కంటెస్టెంట్స్ అదరగొడుతున్నారు.. ఇక అందరికి తెలిసిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న మరికొందరు కెప్టెన్సీలో అంతగా ఆకట్టుకోవడం లేదు.
బ్లూ టీమ్, రెడ్ టీమ్, ఎల్లో టీమ్, గ్రీన్ టీమ్ అంటూ నాలుగు టీమ్ లుగా బిగ్ బాస్ విడదీశాడు. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ రేస్ నుంటి మొదటగా తనూజ అవుట్ అవ్వగా.. ఎపిసోడ్ చివర్లో గ్రీన్ టీమ్ తప్పుకుంది. గ్రీన్ టీమ్ లోని దమ్ము శ్రీజ, భరణి, సంజన కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నారు. ఇక ఈ టాస్క్ ల మధ్యలో హౌస్ మేట్స్ అంతా సరదగా మాట్లాడుకున్నారు. రీతూ, తనూజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాల, దమ్ము శ్రీజలు కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో తనూజకి ట్రూత్ అని రావడంతో.. నీ బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటి.. ట్రూత్ అన్నారు కాబట్టి నిజమే చెప్పాలి.. అబద్దం చెప్తే దూరం అయిపోతారని ఇమ్మాన్యుయల్ అన్నాడు. దాంతో తనూజ.. హృతిక్ రోషన్ అని చెప్పింది. ఆ తర్వాత కళ్యాణ్ పడాల వంతు రావడంతో.. ఈ హౌస్‌లో లవ్ చేయొచ్చని అనిపించే వాళ్లు ఎవరున్నారని ఇమ్మాన్యుయల్ అడిగాడు. తనూజ అని కళ్యాణ్ చెప్పాడు. తర్వాత మళ్లీ తనూజకి ట్రూత్ రావడంతో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పమని ఇమ్మాన్యుయల్, శ్రీజ అడిగారు. దాంతో తనూజ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. నా ఫస్ట్ లవ్ స్టోరీ 8వ తరగతిలో మొదలైంది. అతని పేరు కళ్యాణ్ అని చెప్పింది. ఆ మాట వినగానే కళ్యాణ్.. ఆహా అంటూ తెగ ఫీల్ అయిపోయాడు.
డ్యాన్స్ క్లాస్‌లో నా ఫస్ట్ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. నాకు డైరెక్ట్‌గా గ్రీటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నాకు ప్రపోజ్ చేసిన ఫస్ట్ పర్సన్ అతనే. తను చాలా మంచోడు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అది చాలా క్యూట్ లవ్ స్టోరీ.. బట్ వన్ సైడ్ లవ్ స్టోరీ తనకి. తను ఇప్పటికి నాతో టచ్‌లో ఉన్నాడు. తనకి పెళ్లైపోయిందంటూ తన ఫస్ట్ లవ్ స్టోరీని చెప్పింది తనూజ. ఆ తర్వాత మళ్లీ డేర్ రావడంతో.. కళ్యాణ్ పడాలతో కలిసి స్టెప్‌లు వేసింది తనూజ. ఇలా ఎపిసోడ్ ఫన్ అండ్ టాస్క్ లతో గడిచింది. ఈ ఎపిసోడ్ లో తనూజ చెప్పిన లవ్ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
![]() |
![]() |